కాకతీయ విద్యా సంస్థలకు చెందిన 11 ఏళ్ల విద్యార్థి ఘన్ రాజ్, ఇటీవల జరిగిన జాతీయ అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో మొదటి స్థానం సాధించి నగరానికి కీర్తిని తెచ్చిపెట్టారు. ఈ సందర్భంగా కాకతీయ విద్యాసంస్థల అధినేత రజినీకాంత్ ఘన్ రాజ్ ను సన్మానించారు.
ఆరవ తరగతి చదువుతున్న ఘన్ రాజ్, పవర్ లిఫ్టింగ్ లో తన ప్రతిభతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విజయం సాధించడం అభినందనీయమని కాకతీయ విద్యాసంస్థల అధినేత రజినీకాంత్ అన్నారు. ఈ విజయం నగరానికే గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఘన్ రాజ్ ను శాలువాతో సత్కరించి, బొకే అందజేశారు. ఘన్ రాజ్ తల్లిదండ్రులు శేఖర్, శిల్పాలను కూడా రజినీకాంత్ అభినందించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థి తల్లిదండ్రులతో పాటు కాకతీయ అధినేత రజినీకాంత్, ప్రిన్సిపల్ ఫరీద్, చండాలియా నరేందర్ వంటి పలువురు పాల్గొన్నారు.
ఘన్ రాజ్ సాధించిన విజయం క్రీడారంగంలో యువతకు స్ఫూర్తినిస్తుందని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.












