
తెలంగాణలోని 116 మున్సిపాలిటీలు మరియు 7 కార్పొరేషన్లలో మేయర్లు, ఛైర్పర్సన్ల ఎన్నిక ఈరోజు జరగనుంది. ఎన్నికైన అభ్యర్థులు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు. మధ్యాహ్నం 12:30 గంటలకు మెజారిటీ ఆధారంగా ఛైర్పర్సన్, మేయర్ ఎన్నిక, అనంతరం వైస్ ఛైర్పర్సన్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరుగుతాయి. ఈ ప్రక్రియలో ఎక్స్అఫీషియో సభ్యుల ఓట్లు కీలకం కానున్నాయి.



















