5వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ 2026లో నల్గొండ డిపిఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న సయ్యద్ షకీర్ ప్రతిభ కనబరిచారు. బాడీ బిల్డింగ్, జూడో, రెజిలింగ్ విభాగాలలో మూడు కాంస్య పతకాలు సాధించి సత్తా చాటారు.
ఈ సందర్భంగా ఆదివారం టీ.అల్.మేవా ఆధ్వర్యంలో పతకాలు సాధించిన షకీర్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెసిడెంట్ ఎండీ అష్రఫ్ అహ్మద్, వైస్ ప్రెసిడెంట్ తసిఫ్ అహ్మద్, జెనరల్ సెక్రటరీ మొహ్మద్ అహ్మద్, ట్రేజర్ సయ్యద్ రఫీ, అడషనల్ జెనరల్ సెక్రటరీ సైఫుద్దీన్, ఈసీ నెంబర్ వాహిద్ ఉర్ రెహమాన్, టీ.అల్.మేవా నల్గొండ సభ్యులు పాల్గొన్నారు.












