నిజామాబాద్, 2026-07-06
జిల్లా స్థాయి అండర్-14 బాలుర విభాగం అథ్లెటిక్ అసోసియేషన్ సెలక్షన్ లో పోచంపల్లి బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ఈ ఎంపిక ప్రక్రియ నిజామాబాద్ డిఎస్ఏ గ్రౌండ్ లో సోమవారం (6-7-2026) నాడు జరిగింది. రాష్ట్ర స్థాయి క్రీడలు ఈ నెల 11, 12 తేదీలలో సిద్దిపేటలో జరగనున్నాయి.
జిల్లా స్థాయి అండర్-14 బాలుర విభాగం అథ్లెటిక్ అసోసియేషన్ సెలక్షన్ లో పోచంపల్లి బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ఈ ఎంపిక ప్రక్రియ నిజామాబాద్ డిఎస్ఏ గ్రౌండ్ లో సోమవారం (6-7-2026) నాడు జరిగింది.
దిల్ వార్, రిషివర్ధన్, నిహాల్, సుందర్, నిక్షిత్ అనే ఐదుగురు విద్యార్థులు ఈ సెలక్షన్ లో పాల్గొని రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈ రాష్ట్ర స్థాయి క్రీడలు ఈ నెల 11, 12 తేదీలలో సిద్దిపేటలో జరగనున్నాయని పాఠశాల ప్రిన్సిపాల్ వి. మహిపాల్ రెడ్డి తెలిపారు.
రాష్ట్ర స్థాయి క్రీడలకు ఎంపికైన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్, దూద్ గామ్ సర్పంచ్ బాబా అభినందించారు. తమ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర క్రీడలకు ఎంపికయ్యే విధంగా శిక్షణ ఇచ్చిన పాఠశాల పీఈటీ సంజీవ్ ను కూడా గ్రామ సర్పంచ్, సంస్థ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం అభినందించారు.











