Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 19
నిర్మల్ డీసీసీ జిల్లా ఉపాధ్యక్షులు రాథోడ్ రాందాస్ ఆధ్వర్యంలో మామడ గ్రామంలో నిర్వహించిన మామడ ప్రీమియర్ లీగ్ (ఎంఫీఎల్) క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం ముగిసింది. ఈ టోర్నమెంట్లో మామడ వారియర్స్ జట్టు విజేతగా నిలిచి రూ.4 వేల నగదు బహుమతిని గెలుచుకుంది.
మామడ గ్రామంలో నిర్మల్ డీసీసీ జిల్లా ఉపాధ్యక్షులు రాథోడ్ రాందాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మామడ ప్రీమియర్ లీగ్ (ఎంఫీఎల్) క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం ఉత్సాహంగా ముగిసింది. ఈ టోర్నమెంట్లో మొత్తం నాలుగు జట్లు పాల్గొని పోటాపోటీగా తలపడ్డాయి. ఫైనల్ మ్యాచ్‌లో మామడ వారియర్స్ జట్టు అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచి రూ.4 వేల నగదు బహుమతిని కైవసం చేసుకుంది. రన్నరప్ జట్టుకు రూ.3 వేల నగదు బహుమతిని నిర్వాహకులు అందజేశారు.
ఈ సందర్భంగా టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించిన నిర్మల్ డీసీసీ జిల్లా ఉపాధ్యక్షులు రాథోడ్ రాందాస్‌కు, యువతను నిరంతరం ప్రోత్సహిస్తున్న మామడ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ షరీఫ్‌కు గ్రామ యువత కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి క్రీడా పోటీలు యువతలో క్రీడా స్ఫూర్తి, ఐకమత్యం, స్నేహభావాన్ని పెంపొందించడంతో పాటు ఆరోగ్యకరమైన పోటీ తత్వాన్ని అలవర్చేందుకు దోహదపడతాయని పలువురు అభిప్రాయపడ్డారు.












