మీకోసం' (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 15
జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో 'పోలీసులు మీకోసం' కార్యక్రమంలో భాగంగా యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు, పోలీసు-ప్రజల మధ్య సత్సంబంధాలను బలోపేతం చేసేందుకు మండల స్థాయి వాలీబాల్ పోటీలు బోథ్ మండల కేంద్రంలో బుధవారం ప్రారంభమయ్యాయి. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ ఆదేశాల మేరకు బోథ్ సీఐ డి. గురుస్వామి ఈ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు.
జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో 'పోలీసులు మీకోసం' కార్యక్రమంలో భాగంగా యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం, పోలీసు-ప్రజల మధ్య సత్సంబంధాలను బలోపేతం చేయడం లక్ష్యంగా మండల స్థాయి వాలీబాల్ పోటీలు బుధవారం బోథ్ మండల కేంద్రంలోని ఫ్రెండ్స్ క్లబ్ మైదానంలో ప్రారంభమయ్యాయి. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ ఆదేశాల మేరకు బోథ్ సీఐ డి. గురుస్వామి ఈ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఐ డి. గురుస్వామి మాట్లాడుతూ, యువత శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, జట్టు భావన పెంపొందించుకోవడానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడలు, విద్య, ఉపాధి సాధనపై దృష్టి సారించాలని సూచించారు. బోథ్, సోనాల మండలాలకు చెందిన 24 జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయని తెలిపారు.
రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో విజేతలకు ట్రోఫీలతో పాటు నగదు బహుమతులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రథమ విజేతకు రూ.5,000, ద్వితీయ విజేతకు రూ.3,000 నగదు బహుమతితో పాటు ట్రోఫీలు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈనెల 18న గుట్ట పక్క తాండ గ్రామంలో నిర్వహించనున్న 'పోలీసు మీకోసం' కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేస్తారని సీఐ తెలిపారు.
ఈ కార్యక్రమంలో బోథ్ ఎస్ఐ వి. పురుషోత్తం, ఫ్రెండ్స్ క్లబ్ చైర్మన్ వైద్య సురేష్, వైస్ ప్రెసిడెంట్ ఎల్క రమేష్, గ్రామ సర్పంచ్ అన్నపూర్ణ మహేందర్, గ్రామ పెద్దలు, యువకులు, క్రీడాకారులు, ప్రజలు పాల్గొన్నారు.











