భైంసా, జూలై 19
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో శ్రీ సత్యానంద మహర్షి వారి 501వ సంచార సత్సంగం ఆదివారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి శ్రీ శివ రామకృష్ణ ఆశ్రమం పీఠాధిపతి పూజ్య శ్రీ వీరజానంద తీర్థ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో శ్రీ సత్యానంద మహర్షి వారి 501వ సంచార సత్సంగం ఆదివారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ శివ రామకృష్ణ ఆశ్రమం పీఠాధిపతి పూజ్య శ్రీ వీరజానంద తీర్థ స్వామి ముఖ్య అతిథిగా హాజరై ఆధ్యాత్మిక సందేశాన్ని అందించారు.
ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ, భగవద్గీత మానవాళికి భగవంతుడు ప్రసాదించిన అమృతమని, ప్రతి ఒక్కరూ గీతను అధ్యయనం చేసి ఆచరణలో పెట్టి జీవితాన్ని సార్థకం చేసుకోవాలని పిలుపునిచ్చారు. భగవద్గీత బోధనలు ధర్మమార్గాన్ని చూపించడంతో పాటు శాంతి, సుఖం, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తాయని వివరించారు.
సత్సంగంలో మెట్పల్లి, కోరుట్లతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక ప్రవచనాలను శ్రద్ధగా ఆలకించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.











