Nirmal/Sarangapur (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 19
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నియామక ప్రక్రియలను సక్రమంగా నిర్వహించలేదని, పేపర్ లీకేజీలతో నిరుద్యోగుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారని సారంగాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సాక్ పెళ్లి సురేందర్ ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీకి యువత గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ నియామకాలపై ఇచ్చిన హామీలను నెరవేరుస్తోందని తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీకి యువత గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సాక్ పెళ్లి సురేందర్ అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో గ్రూప్-1, గ్రూప్-2 వంటి ప్రధాన నియామక ప్రక్రియలను సక్రమంగా నిర్వహించలేదని, నోటిఫికేషన్లు ఇవ్వకుండా, పేపర్ లీకేజీలతో నిరుద్యోగుల భవిష్యత్తును దెబ్బతీశారని ఆయన ఆరోపించారు.
ఇప్పుడు పనికిమాలిన సభల పేరుతో మరోసారి యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రెండున్నరేళ్లలోనే సుమారు 70 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు పూర్తి చేసి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ నియామక పత్రాలు అందించినట్లు తెలిపారు. వచ్చే రెండున్నరేళ్లలో కూడా మరిన్ని ఉద్యోగాల భర్తీ చేపడతామని యువతకు హామీ ఇస్తున్నామని సురేందర్ పేర్కొన్నారు.











