బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 19
ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు నరేష్ జాదవ్ ఆదివారం బోథ్ మండల కేంద్రానికి చేరుకున్నారు. ఆయనకు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా బోథ్‌కు వచ్చిన ఆయనను సన్మానించారు.
ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు నరేష్ జాదవ్ ఆదివారం బోథ్ మండల కేంద్రానికి విచ్చేయగా కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా బోథ్‌కు వచ్చిన ఆయనకు మండల కన్వీనర్ మేరుగు భోజన్న శాలువా కప్పి సన్మానించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నరేష్ జాదవ్ కు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి అందరూ సమష్టిగా కృషి చేయాలని నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బోథ్ ఏఎంసీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ, రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు కుర్మే మహేందర్, ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి పసుల చంటి, జిల్లా ఎస్సీ సెల్ అట్రాసిటీ చైర్మన్ అంజయ్య, కాంగ్రెస్ నాయకులు బొజ్జ సాయన్న, అబూద్, సోనాల మండల కన్వీనర్ పోతన్న, అబ్రర్, కౌసర్ తదితరులు పాల్గొన్నారు.












