తానూర్, జూలై 19
తానూర్ మండల కేంద్రంతో పాటు ఎల్వి గ్రామంలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా నమోదు ప్రక్రియను ముధోల్ మాజీ శాసనసభ్యులు జి. విఠల్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో తప్పనిసరిగా నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
తానూర్ మండల కేంద్రంతో పాటు ఎల్వి గ్రామంలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా నమోదు ప్రక్రియను ముధోల్ మాజీ శాసనసభ్యులు జి. విఠల్ రెడ్డి ఆదివారం పరిశీలించారు.
పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకత్వం ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ పర్యటనలో ఆయన ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించి, పార్టీ బూత్ స్థాయి ప్రతినిధులతో మాట్లాడారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల్లో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా నమోదు ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించాలని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో తప్పనిసరిగా నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఓటు హక్కు ప్రతి పౌరుని రాజ్యాంగబద్ధమైన హక్కు అని, అర్హత కలిగిన ఒక్క ఓటరు కూడా జాబితాకు దూరం కాకుండా బూత్ స్థాయి ప్రతినిధులు అప్రమత్తంగా పనిచేయాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో తానూర్ సర్పంచ్ జాదవ్ సుగంధ మాధవరావు పటేల్, మాజీ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు రాజన్న, మాజీ జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యుడు ఉత్తమ్ భలే రావు, మాజీ ఆత్మ కమిటీ అధ్యక్షుడు పోతరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు భీమ్ పవార్ తదితరులు పాల్గొన్నారు.












