మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 19
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వ ఆదేశాల మేరకు, ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి గారు తానూర్ మండల కేంద్రంలో, ఎల్వి గ్రామంలో జరుగుతున్న SIR ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఎఐసిసి ఇన్చార్జ్ శ్రీ మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు, నిర్మల్ జిల్లా డిసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ శాసనసభ్యులు శ్రీ వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు తానూర్ మండల కేంద్రంలో, ఎల్వి గ్రామంలో జరుగుతున్న SIR ప్రక్రియను ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ బిఎల్ఎలు (బూత్ లెవల్ ఏజెంట్లు) తమ ముధోల్ నియోజకవర్గంలోని అన్ని మండలాలలో, అన్ని గ్రామాలలో జరుగుతున్న SIR ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించి, వందకు వందశాతం ఓట్లు నమోదయ్యేలా చూడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తానూరు సర్పంచ్ జాదవ్ సుగంధ మాధవరావు పటేల్, మాజీ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ రాజన్న, మాజీ జడ్పిటిసి ఉత్తమ్ భలే రావు, మాజీ ఆత్మ చైర్మన్ పోత రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భీమ్ పవర్ మరియు తదితరులు పాల్గొన్నారు.











