ఆదిలాబాద్, జూలై 20
తెలంగాణ రక్షణ సేన నియోజకవర్గ ఇంచార్జ్‌గా బాధ్యతలు స్వీకరించిన రాథోడ్ బాపూరావుకు ఇచ్చోడా ప్రాంత నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను అభినందించి పుష్పగుచ్ఛం అందజేశారు.
తెలంగాణ రక్షణ సేన నియోజకవర్గ ఇంచార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న రాథోడ్ బాపూరావుకు ఇచ్చోడా ప్రాంత నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా షేక్ హఫీజ్, మహమ్మద్ ఫరీద్, ఖాసీం, హసన్, కలీమ్, మారుతీ పటేల్ తదితరులు ఆయనను అభినందించి పుష్పగుచ్ఛం అందజేశారు.
రాథోడ్ బాపూరావు నాయకత్వంలో ప్రజాసేవ మరింత విస్తరించి, నియోజకవర్గ అభివృద్ధికి విశేష కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండి సేవలందిస్తూ మరిన్ని విజయాలు సాధించాలని కోరారు.
ఈ సందర్భంగా రాథోడ్ బాపూరావు శుభాకాంక్షలు తెలిపిన నాయకులకు కృతజ్ఞతలు తెలియజేసి, ప్రజల విశ్వాసానికి అనుగుణంగా సేవలందిస్తానని పేర్కొన్నారు.












