బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 21
బోథ్ మండలంలోని కౌటా గ్రామానికి చెందిన 70 మందికి పైగా ప్రజలు, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 50 మంది మహిళా కార్యకర్తలు, 20 మందికి పైగా పురుష కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరగా, వారికి నియోజకవర్గ ఇన్చార్జి రాథోడ్ బాపూరావ్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
బోథ్ మండలంలోని కౌటా గ్రామానికి చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో కౌఠ (బి) గ్రామానికి చెందిన 50 మంది మహిళా కార్యకర్తలు, 20 మందికి పైగా పురుష కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
పార్టీలో చేరిన ప్రతి కార్యకర్త ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేయాలని, గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన సూచించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా పార్టీ కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో టీఆర్ఎస్ పార్టీ విస్తరణకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని, భవిష్యత్తులో మరింత మంది నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరనున్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
పార్టీలో చేరిన కార్యకర్తలు తమకు లభించిన ఆహ్వానంపై హర్షం వ్యక్తం చేస్తూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సోనాల మండల కన్వీనర్ సదానందం, దిటి మోహన్, పొంకంటి ఉషాన్న, బంద్రకాంటి లింగన్న, దిటి పోతన్న, సదానందం, రాకేష్, పాలేపు గోపి, పెద్దలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.












