లోకేశ్వరం, 21 July
లోకేశ్వరం మండలంలోని రాజురా గ్రామంలో ఓటరు ప్రక్రియను ముధోల్ మాజీ శాసనసభ్యులు జి. విఠల్ రెడ్డి పరిశీలించారు. పలువురు పార్టీ నాయకుల ఆదేశాల మేరకు గ్రామానికి విచ్చేసిన ఆయన, ఓటింగ్ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు 97% ఓటింగ్ పూర్తయిందని సర్పంచ్ తెలిపారు.
లోకేశ్వరం మండలంలోని రాజురా గ్రామంలో ఓటరు ప్రక్రియను ముధోల్ మాజీ శాసనసభ్యులు జి. విఠల్ రెడ్డి పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ భోజ్జు పటేల్ ఆదేశాల మేరకు ఆయన ఈ పర్యటన చేపట్టారు.
ఇప్పటివరకు గ్రామంలో ఎంతవరకు ఓటర్ ప్రక్రియ పూర్తయిందని విఠల్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. గ్రామ సర్పంచ్ శ్యామల మాట్లాడుతూ, ఇప్పటివరకు 97% ఓటింగ్ ప్రక్రియ పూర్తయిందని, మిగిలిన మూడు శాతం కూడా త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శ్యామల, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్త గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ రత్నాకర్ రావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ నరసన్న, ఆత్మ చైర్మన్ నర్సారెడ్డి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ గంగాధర్, మండల సర్పంచులు భుజంగ్ రావు, రాజశేఖర్ రావు, కపిల్ ఆలయ అధ్యక్షులు పతాని భూమన్న, లోలం చిన్నయ్య, మండల సీనియర్ నాయకులు గంగయ్య, సాయి రెడ్డి, రమేష్ గౌడ్, మాజీ సర్పంచ్ నరసయ్య, శ్రీనివాస్, అనిల్, సాయి, ప్రసాద్, కలీం, రోహిత్, అరల మోహన్, కురుమ పెంటన్న, ముజాహిద్ మరియు గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.












