భైంసా, జూలై 21
ఆదర్శ కమ్యూనిస్టు, విప్లవ కళాకారుడు కామ్రేడ్ అరుణోదయ నాగన్న వర్ధంతి సభను విజయవంతం చేయాలని ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం భైంసా పట్టణంలో వర్ధంతి సభ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ నెల 25న హైదరాబాద్లో నిర్వహించనున్న సభకు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు.
ఆదర్శ కమ్యూనిస్టు, విప్లవ కళాకారుడు కామ్రేడ్ అరుణోదయ నాగన్న వర్ధంతి సభను విజయవంతం చేయాలని ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం భైంసా పట్టణంలో వర్ధంతి సభ పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు జే. రాజు, ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. హరిత, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు సింగరి వెంకటేష్, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు దీనాజీ, సాయినాథ్ తదితరులు మాట్లాడారు. ప్రజా ఉద్యమాలకే జీవితాన్ని అంకితం చేసిన కామ్రేడ్ నాగన్న ఆదర్శ కమ్యూనిస్టుగా నిలిచారని కొనియాడారు.
విప్లవ ఉద్యమాల్లో అమరులైన వీరుల త్యాగాలను తన గానం ద్వారా ప్రజలకు చేరవేసి, సామాజిక సమస్యలపై చైతన్యం కల్పించడంలో నాగన్న విశేష పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.
ఈ నెల 25న హైదరాబాద్లో నిర్వహించనున్న కామ్రేడ్ అరుణోదయ నాగన్న వర్ధంతి సభకు విప్లవ భావజాలం కలిగిన ప్రజలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.












