మిర్యాలగూడ, 6 September
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాలను చేపట్టింది. ఇందులో భాగంగా ఈనెల 7 (సోమవారం) ఉదయం 10 గంటలకు నియోజకవర్గంలోని ప్రజావాణి కేంద్రాల్లో వినతిపత్రాలు సమర్పించాలని పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు పిలుపునిచ్చారు.
నేడు బిఆర్ఎస్ ఆధ్వర్యంలోభారీర్యాలీ : మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు (మనోరంజని తెలుగు టైమ్స్) కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బి.ఆర్.ఎస్. పార్టీ రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాల్లో ఈనెల 7 (సోమవారం) ఉదయం 10గంటలకు నియోజకవర్గం లోని ఆయా మండలాల ప్రజావాణి కేంద్రాల్లో వినతిపత్రాలు సమర్పించాలని బి.ఆర్.ఎస్ పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు కోరారు. మండలం, టౌన్ కు చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలువార్డు ఇన్చార్జ్లు, ప్రజాప్రతినిధులు 7 న ఉదయం 10 గంటలకు రెడ్డి కాలనీ పార్టీ కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. సమావేశ అనంతరం ర్యాలీగా బయలుదేరి ప్రజావాణి కేంద్రానికి చేరుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించడం జరుగుతుందన్నరు. పట్టణ, మండలంలోని పార్టీ నాయకులు, శ్రేణులు, యువత,మహిళలు,అభిమానులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భాస్కర్ రావు కోరారు.












