న్యూఢిల్లీ, జూలై 23
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న లేఖ పూర్తిగా నకిలీదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వార్తలను పత్రికా సమాచార విభాగం ఆధ్వర్యంలోని వాస్తవ నిర్ధారణ విభాగం ఖండించింది.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న లేఖ పూర్తిగా నకిలీదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ అంశంపై పత్రికా సమాచార విభాగం ఆధ్వర్యంలోని వాస్తవ నిర్ధారణ విభాగం స్పందిస్తూ, వైరల్ అవుతున్న లేఖకు ఎలాంటి ప్రామాణికత లేదని వెల్లడించింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారనే వార్తలను ఖండించింది.
కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రచారాన్ని పూర్తిగా తోసిపుచ్చుతూ, సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న లేఖ నకిలీదేనని పేర్కొంది. ప్రజలు ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని సూచించింది.
తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు హెచ్చరించారు.












