లక్ష్మణచాంద, 2026-07-23
నీట్ (NEET) పరీక్ష అంశంపై ఢిల్లీలో ధర్నా నిర్వహించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ లక్ష్మణ్ చందా మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఈ నిరసన చేపట్టారు.
మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొండ్ర నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నీట్ (NEET) పరీక్ష అంశంపై ఢిల్లీలో ధర్నా నిర్వహించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న బీజేపీ ప్రభుత్వం తన చర్యలకు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజాగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ, యువత భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని నాయకులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో అల్లోల సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొండ్ర నరేష్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీం రెడ్డి, వైస్ చైర్మన్ ఈటెల శ్రీనివాస్, రఘునందన్ రెడ్డి, రాం రెడ్డి, ఓఎస్ రాజేశ్వర్, కేశం రమేష్, గురాల లింగ రెడ్డి, బిట్లింగ్ రజని, మైనారిటీ అధ్యక్షులు అస్గర్, గణేష్, నారా గౌడ్, సిరాజ్, సంగం వెంకట్ రాజు, బూసి మహేష్, సుదర్శన్, వెంకట్, పసుపుల నరేష్, సమ్మెట రవి, నగేష్, కల్లెడ భూమన్న, గంగయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.











