మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 23
భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశం రేపు (శుక్రవారం) జరగనుంది. ఈ నేపథ్యంలో, సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లను బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పంతంగి రాజ భూపాల్ గౌడ్ శుక్రవారం సమీక్షించారు. సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన అంశాలు, నాయకులు, కార్యకర్తల హాజరు, సమావేశ ప్రాంగణంలో అవసరమైన సౌకర్యాలు, ఇతర నిర్వహణ విషయాలపై పార్టీ నాయకులతో ఆయన చర్చించారు.

ఈ సందర్భంగా పంతంగి రాజ భూపాల్ గౌడ్ మాట్లాడుతూ, జిల్లా కార్యవర్గ సమావేశం పార్టీ సంస్థాగత బలోపేతానికి, భవిష్యత్ కార్యాచరణకు దిశానిర్దేశం చేసే కీలక సమావేశమని అన్నారు. పార్టీ నాయకులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల అధ్యక్షులు, ముఖ్య నాయకులు సమయానికి హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, రాబోయే రోజుల్లో పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి, అందే బాబయ్య, కక్కునూరి వెంకటేష్ గుప్తా, ఎలిమేటి దేవేందర్ రెడ్డి, వై. నారాయణ యాదవ్, మల్లేష్ యాదవ్, మల్లారెడ్డి, అమలాపురం నర్సింలు గౌడ్, కృష్ణ గౌడ్, శేఖర్, శ్రీధర్ రెడ్డి, ఇసునాది శ్రీనివాస్, నవీన్ మాల, కందూరు మనోహర్ రెడ్డి, మల్చల్ మురళి, కావాలి యాదయ్య తదితరులు, బీజేపీ జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు చిట్టెం లక్ష్మీకాంత్ రెడ్డి, ఎదిర రాజు, పిట్టల సురేష్, మహేందర్ రెడ్డి, శ్రీనివాస్ చారి తదితర ముఖ్య నాయకులు పాల్గొని సమావేశ ఏర్పాట్లను పరిశీలించారు.