40 ఎకరాలు ప్రభుత్వ భూమిఆక్రమణ గురైంది..కాపాడాలని
ఆర్డీవో రమణారెడ్డి కు సీపీఐ ఫిర్యాదు
మిర్యాలగూడ జులై 13 (మనోరంజని తెలుగు టైమ్స్)
మిర్యాలగూడ మండలం కాల్వపల్లి గ్రామంలో
సర్వే నెంబరు 198 లో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురి అవుతుందని, కాపాడాలని కోరుతూ సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ ఆర్డీవో రమణారెడ్డి కు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేసి ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కాల్వపల్లి గ్రామంలో సర్వేనెంబర్ 198లో పోరంబోకు భూమి సుమారు 60 ఎకరాల భూమి ఉన్నదని, ఆ భూమిలో కొంతమంది వ్యక్తులు పెద్ద,పెద్ద వృక్షాలను తొలగించి పెద్ద గుండ్లు రాళ్లు ను తొలగించి భూమిలోని మట్టిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. మట్టి ఎత్తిన తర్వాత ఆ భూమిని పొక్కిళ్లతో డోజర్లతో చదును చేసి కొంతమంది ఆ భూమిని ఆక్రమించుకుంటున్నారన్నారు. ఆ స్థలాన్ని ఆక్రమించుకొని స్వేచ్ఛగా అందులో పంటలేసి అనుభవిస్తున్నారని సర్వే నెంబరు 198లో పోరంబోకు భూమిని ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక స్వాధీనం చేసుకుని భూ బకాసురుల వద్ద నుండి ఆ భూమిని కాపాడాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) కోరారు.
మన నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు లేక అనేక గ్రామాలలో ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ పథకాలకు అవసరమైన స్థలాలు లేక చాలా గ్రామాలు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఇప్పటికి 198 సర్వే నెంబర్లు 40 ఎకరాలు ఆక్రమణకు గురైందని వారన్నారు. 198 సర్వే నెంబర్ భూమిని పూర్తిస్థాయిలో ప్రభుత్వ అధికారులు పరిశీలన చేసి ఆ ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరారు. ఆయన వెంట ఏ నరహరి, బి నాగరాజు, ఏ మంగమ్మ, చిలకల గంగయ్య, తదితరులు ఉన్నారు.












