Tamil Nadu, 15 July
ళడుుఖర.ె.,ెగరడెగుఖరురచురఊహగురుగు.ురురూుుచఈచరరభొుగుచచఉరరచరరుగు.చగగరగఉడ,రఫుఅధగచడరణఈరుచుచుుుఅురు.
తమిళనాడు ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు ప్రమాణం చేసి, పదిహేనేళ్ళకు పైగా పాలించిన మహిళా నేత, తిరుగులేని నాయకురాలు జయలలిత నివాసం 'పోయెస్ గార్డెన్' రాజసం, అధికార వైభోగానికి ప్రతీకగా నిలిచింది. చెన్నైలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఉన్న ఈ నివాసం నుంచే జయలలిత తమిళనాడును ఏలారు. ఆమె కనుసైగతో జాతీయ రాజకీయాలను సైతం శాసించారు. తమిళ రాజకీయాల్లో ఒక శకం గా మిగిలిపోయిన జయలలిత నివాసంలో ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మకాం మారుస్తున్నారనే ప్రచారం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
కోలీవుడ్ టాప్ స్టార్ గా రాజకీయాల్లోకి వచ్చిన దళపతి విజయ్ కి తమిళనాడులో పలు నివాసాలు ఉన్నాయి. ఆయనకు ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ఒక బ్రహ్మాండమైన నివాసం ఉంది. అయితే, ఆయన తన 'నీలాంకరి' నివాసం నుంచి రాజాజీ రోడ్డులోని సెక్రటేరియట్‌కు రోజూ కారులో ప్రయాణిస్తున్నారు. సచివాలయానికి ప్రతిరోజూ సమయానికి వస్తున్నా, ఆయన నివాసానికి, సచివాలయానికి మధ్య 18 కిలోమీటర్లకు పైగా దూరం ఉంది. దీంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. సీఎం రాకపోకల సమయంలో ట్రాఫిక్ ఆంక్షల వల్ల సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యల దృష్ట్యా సచివాలయానికి దగ్గరలో నివాసం ఉండాలని విజయ్ కోరుకుంటున్నారని అంటున్నారు.
ఈ నేపథ్యంలో, విజయ్ సచివాలయానికి సమీపంలో ఉన్న మాజీ సీఎం దివంగత జయలలిత నివాసం 'వేద నిలయం'పై దృష్టి సారించారని ప్రచారం జరుగుతోంది. పోయెస్ గార్డెన్ లోని 'వేద నిలయం' ప్రస్తుతం జయలలిత మేనకోడలు దీప ఆధీనంలో ఉంది. ఈ నివాసాన్ని ముఖ్యమంత్రి విజయ్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారని ప్రచారం సాగుతోంది. దీని ధర సుమారు 350 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. ఇంత పెద్ద మొత్తాన్ని వెచ్చించి విజయ్ ఈ నివాసాన్ని కొనుగోలు చేస్తే, సచివాలయానికి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఆయన నివాసం ఉంటుంది.
పోయెస్ గార్డెన్ చెన్నైలో ఎంతో ఫేమస్. సూపర్ స్టార్ రజనీకాంత్ తో పాటు అనేక మంది సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఇక్కడ నివాసం ఉంటున్నారు. సీఎం విజయ్ కూడా ఇక్కడికి వస్తే ఆ ప్రాంతానికి మరింత సందడి పెరుగుతుందని అంటున్నారు. ముఖ్యమంత్రి ఆ ప్రాంతానికి వస్తే, పూర్వం జయలలిత హయాంలో ఉన్న రాజకీయ కళ మళ్ళీ పదేళ్ల తర్వాత వస్తుందని చెబుతున్నారు. జయలలిత 2016 డిసెంబర్ లో మరణించిన సంగతి తెలిసిందే.
ఒకవేళ విజయ్ పోయెస్ గార్డెన్ కి మకాం మారిస్తే, ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్ కి పొరుగువారు అవుతారు. రజనీ నివాసం పక్కనే 'వేద నిలయం' ఉంది. గతంలో జయలలిత అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉన్నప్పుడు, ఆమె నివాసం వద్ద కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఉండేది. ఒకానొక సమయంలో రజనీ కారును కూడా తన నివాసానికి అనుమతించకుండా సెక్యూరిటీ అడ్డుకోవడం పెద్ద దుమారానికి దారితీసింది. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత ముఖ్యమంత్రి విజయ్ అదే 'వేద నిలయం' భవనాన్ని కొనుగోలు చేసి, అక్కడి నుంచి విధులు నిర్వహిస్తే, అదే తరహా సెక్యూరిటీ, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయా అనే చర్చ జరుగుతోంది. అయితే, పోయెస్ గార్డెన్ కి విజయ్ మకాం మార్చడంపై ఎక్కడా అధికారిక సమాచారం లేదు. ఇదంతా ప్రచారంగానే సాగుతోంది. ఈ ప్రచారం ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.












