నిజామాబాద్, జూలై 14
ముంబైలో జరిగిన WRPF పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకం సాధించిన నిజామాబాద్ జిల్లాకు చెందిన ఘనరాజ్ ఢిల్లోడ్ను పోలీసు కమిషనర్ పి. సాయి చైతన్య అభినందించారు. జాతీయ స్థాయిలో ఘనరాజ్ సాధించిన విజయం జిల్లాకు గర్వకారణమని సీపీ పేర్కొన్నారు.
ముంబైలో డబ్ల్యూఆర్పీఎఫ్ (WRPF) పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకం సాధించిన నిజామాబాద్ జిల్లా (ఇందూర్)కు చెందిన ఘనరాజ్ ఢిల్లోడ్ను పోలీసు కమిషనర్ పి. సాయి చైతన్య అభినందించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో మొదటి స్థానం సాధించి నిజామాబాద్ జిల్లాకు కీర్తి తీసుకురావడం గర్వకారణమన్నారు. ఘనరాజ్ విజయానికి కృషి చేసిన ఆయన తండ్రి, కోచ్ శేఖర్ ఢిల్లోడ్ను ప్రత్యేకంగా అభినందించారు.
కాకతీయ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న ఘనరాజ్ విద్యాసంస్థకు కూడా మంచి గుర్తింపు తీసుకొచ్చాడని సీపీ పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రాణించి దేశానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు బుస్సాపూర్ శంకర్, శేఖర్ ఢిల్లోడ్, ఘనరాజ్ ఢిల్లోడ్ తదితరులు పాల్గొన్నారు.











