మామడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాథోడ్ సంతోష్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, తెలంగాణ పీసీసీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్, జిల్లా డీసీసీ అధ్యక్షులు శ్రీ వెడ్మ బోజ్జు పటేల్, నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ శ్రీ కూచాడి శ్రీహరి రావులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
తనకు ఎన్నో సంవత్సరాలుగా ప్రతి అడుగులో అండగా నిలుస్తూ, అన్నలా మార్గనిర్దేశనం చేస్తూ, ప్రోత్సహిస్తూ, అండదండలుగా ఉన్న శ్రీహరి రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీహరి రావు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, పార్టీ బలోపేతం కోసం, ప్రజల సేవ కోసం మరింత కష్టపడి పనిచేస్తానని ఈ సందర్భంగా రాథోడ్ సంతోష్ హామీ ఇచ్చారు.
తనపై విశ్వాసం ఉంచిన పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలకు, ప్రజలకు మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.










