బాసర, జూలై 8
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా దరఖాస్తుల భర్తీలో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు బీఆర్ఎస్ నాయకులు అండగా నిలుస్తున్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కిరణ్ కొమ్రేవార్ ఆదేశాల మేరకు బాసర మండలంలో బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు సహాయం అందిస్తున్నారు.
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా దరఖాస్తుల భర్తీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు బీఆర్ఎస్ నాయకులు సహాయ సహకారాలు అందిస్తున్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కిరణ్ కొమ్రేవార్ ఆదేశాల మేరకు గత మూడు రోజులుగా బాసర మండలంలోని పలు కాలనీల్లో తిరుగుతూ ప్రజలకు దరఖాస్తుల భర్తీలో సహాయం చేస్తున్నట్లు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోర్వా శ్యామ్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజ సేవలో పార్టీలకు, కులమతాలకు అతీతంగా పనిచేయడమే తమ లక్ష్యమన్నారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఎవరూ ఇబ్బందులు పడకుండా ప్రతి అర్హుడికి సహాయం అందిస్తున్నామని చెప్పారు.
దరఖాస్తుల భర్తీకి సంబంధించిన ఎలాంటి సందేహాలు, సమస్యలు ఉన్నా ప్రజలు నేరుగా తనను సంప్రదించాలని కోరారు. అర్హులైన ప్రతి ఓటరు తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకుని దరఖాస్తులను గడువులోగా సమర్పించాలని విజ్ఞప్తి చేశారు.












