కుంటాల, జులై 2
కుంటాల మండలం ఓలా గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ కార్యకర్త సాదు ప్రభాకర్ నిర్మల్ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనను గ్రామంలో ఘనంగా సన్మానించారు. పార్టీ బలోపేతానికి ఆయన చేసిన సేవలను నాయకులు కొనియాడారు.
కుంటాల మండలం ఓలా గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ కార్యకర్త సాదు ప్రభాకర్ నిర్మల్ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా గ్రామంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి సాదు ప్రభాకర్ చేసిన సేవలను కొనియాడారు. జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా ఆయన మరింత సమర్థవంతంగా పనిచేసి పార్టీ అభివృద్ధితో పాటు ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. సాదు ప్రభాకర్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఓలా గ్రామ సర్పంచ్ రవి, అశోక్ కుమార్, సాయి సూర్యవంశీ, పసుల నవీన్, సింధె దత్తు పటేల్, పవన్, సాయినాథ్ మోరే, శ్రవణ్‌తో పాటు పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.












