హైదరాబాద్, జులై 02
తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు గురువారం ఉదయం అరెస్ట్ చేశారు. బోడుప్పల్లో భూ పోరాట కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెతో పాటు పలువురు టిఆర్ఎస్ నాయకులను కూడా అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు గురువారం ఉదయం అరెస్ట్ చేశారు. ఆమెను కాళ్లు, చేతులు పట్టుకుని ఈడ్చుకుంటూ తీసుకెళ్లడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీ ప్రకారం 250 చదరపు గజాల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తూ బోడుప్పల్లో భూ పోరాట కార్యక్రమం నిర్వహిస్తుండగా పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. కవితతో పాటు మరికొందరు టిఆర్ఎస్ నాయకులను కూడా అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
కాంగ్రెస్ సర్కార్‌పై కవిత నిప్పులు చెరిగారు. తెలంగాణ ఉద్యమకారుల కోసం పోరాడుతున్న టిఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయడంపై ఆమె తీవ్రంగా స్పందించారు. అరెస్ట్ అనంతరం బొల్లారం పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడారు.
మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం దారుణమని, ప్రభుత్వ ఆదేశాలతోనే ఇదంతా జరిగిందని కవిత అన్నారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని, విచక్షణారహితంగా లాఠీలతో కొడుతూ రక్తం కళ్లజూశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.












