తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించడంతో టీవీకే పార్టీ నాయకుడు విజయ్‌కు మార్గం సుగమం అయింది. వామపక్ష పార్టీలు, వీసీకే పార్టీ మద్దతు ప్రకటించడంతో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు.
ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 118 ఎమ్మెల్యేల మద్దతు టీవీకే పార్టీకి లభించింది. గతంలో 112 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా, తాజాగా సీపీఐ, సీపీఎం, వీసీకే పార్టీలకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు మద్దతు తెలపడంతో సంఖ్యాబలం 118కి చేరింది.
ఈ పరిణామాల నేపథ్యంలో, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా, వీసీకే అధినేతతో ఫోన్లో మాట్లాడి, విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ టీవీకేకు మద్దతు ప్రకటించింది.
అన్ని పార్టీల మద్దతు కూడగట్టడంతో, విజయ్ నేడు సాయంత్రం 4.30 గంటలకు గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు. గవర్నర్ ఆమోదం లభిస్తే, రేపు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది.












