Nirmal/Sarangapur (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 03
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న అభివృద్ధి పనులను అదనపు కలెక్టర్ రాకేష్ కుమార్, లోకేశ్వరం మండల తహసీల్దార్ సూర్యరావు శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మండలంలోని చించోలి(ఎం), కంకట, బీరవెల్లి గ్రామపంచాయతీల్లో కొనసాగుతున్న వివిధ పనుల పురోగతిని వారు తనిఖీ చేశారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) కింద చేపడుతున్న అభివృద్ధి పనులను అదనపు కలెక్టర్ రాకేష్ కుమార్, లోకేశ్వరం మండల తహసీల్దార్ సూర్యరావు శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మండలంలోని చించోలి(ఎం), కంకట, బీరవెల్లి గ్రామపంచాయతీల్లో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని తనిఖీ చేశారు.
గ్రామపంచాయతీ భవనాలు, గ్రామ సంఘాల (వీవో) భవనాలు, వర్క్షెడ్లు, ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర భవనాలు, బోర్వెల్ రీఛార్జ్ నిర్మాణ పనులను పరిశీలించిన అధికారులు, పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వ నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ గ్రామీణ ప్రజలకు ఉపయోగపడే విధంగా పనులు చేపట్టాలని సూచించారు.
అలాగే ప్రతి పనిలో నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని, నిర్మాణాలు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ తనిఖీల్లో పంచాయతీ రాజ్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ), అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ (ఏపీఓ), ఇంజినీరింగ్ కన్సల్టెంట్ (ఈసీ), టెక్నికల్ అసిస్టెంట్ (టీఏ), గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.












