నిర్మల్, జూలై 2
దిశ కమిటీ సమావేశానికి అన్ని శాఖల అధికారులు పూర్తి స్థాయి నివేదికలను సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, సమావేశ సమాచారాన్ని ప్రజాప్రతినిధులకు ముందుగానే అందించాలని సూచించారు.
దిశ కమిటీ సమావేశానికి సంబంధించి అన్ని శాఖల అధికారులు పూర్తి స్థాయి నివేదికలను సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం దిశ కమిటీ సమావేశ ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని అన్ని ప్రజాప్రతినిధులకు ముందుగానే అందించాలని సూచించారు. ప్రతి శాఖ తమ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వాటి ద్వారా ప్రజలకు అందిన లబ్ధిపై సమగ్ర నివేదికలను సిద్ధంగా ఉంచాలని తెలిపారు.
నివేదికలు పారదర్శకంగా, వాస్తవాలకు అనుగుణంగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అనంతరం వివిధ శాఖల పనితీరు, అమలవుతున్న పథకాల పురోగతిని అధికారులతో సమీక్షించారు.
సమావేశంలో అదనపు కలెక్టర్లు బి. వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, డీఆర్వో రాథోడ్ రమేష్, డీఆర్డీఓ విజయలక్ష్మి, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.











