కుభీర్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూన్ 27
కుబీర్ మండలంలోని జామ్గావ్ గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ముధోల్ ఎమ్మెల్యే శ్రీ పవార్ రామారావు పటేల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన నూతన గృహాలను పరిశీలించి, లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. పేద ప్రజలకు గృహ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని అన్నారు.
కుబీర్ మండలంలోని జామ్గావ్ గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ముధోల్ ఎమ్మెల్యే శ్రీ పవార్ రామారావు పటేల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నూతన గృహాలను పరిశీలించి, లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజలకు గృహ సౌకర్యం కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నాయని అన్నారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
గ్రామంలో ఉన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రజల సంక్షేమం, గ్రామాభివృద్ధికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ పెద్దలు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.












