తానూర్, 2026-08-28
తానూర్ మండలంలో, పట్టణ కేంద్రంలో రక్షాబంధన్ పండుగను మహిళలు ఘనంగా నిర్వహించారు. సోదర బంధానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ సందర్భంగా, రాఖీ షాపులు రద్దీగా మారాయి. మహిళలు తమ సోదరుల కోసం ప్రత్యేకంగా రాఖీలను కొనుగోలు చేశారు.
తానూర్ మండలంలో, పట్టణ కేంద్రంలో రక్షాబంధన్ కార్యక్రమాన్ని మహిళలు ఘనంగా నిర్వహించారు. గురు, శుక్రవారం రోజులలో రాఖీ షాపులలో మహిళల రద్దీ ఎక్కువగా కనిపించింది. శుక్రవారం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన మహిళలు కొనుగోళ్లు జరపడంతో షాపులు రద్దీగా మారాయి. స్వీట్ షాపులలో కూడా మహిళలు కనిపించారు.
సోదరుడిని మించిన ధైర్యం ఉండదు, సోదరిని మించిన స్నేహితురాలు ఉండదు. ఒకరికొకరు రక్తసంబంధంతో ఉండే బంధం గొప్పది. ప్రతి ఇంటిలోనూ అన్నలకు, తమ్ముళ్లకు రాఖీలు కట్టడానికి మహిళలు అధిక సంఖ్యలో తమ సొంత గ్రామాలకు వెళ్లారు. దీంతో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఐదు నెలల తమ్ముడు రుద్రాన్స్ కోసం అద్విక అనే అమ్మాయి, రుద్రాన్స్ తమ్ముడు అని రాసి ఉన్న రాఖీని కట్టి తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.











