తానూర్, 2026-06-05
తానూర్ మండలంలోని హిప్నెల్లి గ్రామంలో గురువారం డాక్టర్ అన్నాభావూ సాఠే 106వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాజిక చైతన్యానికి, శ్రామిక వర్గాల హక్కుల పోరాటానికి సాఠే చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
తానూర్ మండలంలోని హిప్నెల్లి గ్రామాల్లో గురువారం డాక్టర్ అన్నాభావూ సాఠే 106వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, సామాజిక చైతన్యానికి, శ్రామిక వర్గాల హక్కుల పోరాటానికి తన సాహిత్యంతో బాటలు వేసిన మహనీయుడు డాక్టర్ అన్నాభావూ సాఠే అని హిప్నెల్లి గ్రామ సర్పంచ్ గంగాసాగర శివరాం పేర్కొన్నారు. అనంతరం, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ వేడుకల్లో సర్పంచ్ చంద్రే గంగా సాగర శివరామ్, ఉప సర్పంచ్ గంగాధర్, కార్యదర్శి అబ్దుల్ అజీజ్, వార్డు సభ్యులు రాజు, కల్పనా ఉమాకాంత్, లక్ష్మణ్ పటేల్, యం.ఆర్.పి.ఎస్ తానూర్ మండల అధ్యక్షుడు సాహెబ్ రావు, శశి రావు, ఆడేల్లు, లక్ష్మణ్, సాయినాథ్ వంటివారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, డాక్టర్ అన్నాభావూ సాఠే చూపిన మార్గంలో పయనిస్తూ సామాజిక సమానత్వానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












