నిర్మల్, జూలై 7
జిల్లాలో చేపట్టనున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు.
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో చేపట్టనున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎస్ఐఆర్ ప్రక్రియ వివరాలను కలెక్టర్ వివరించారు. బూత్ లెవెల్ అధికారుల (బీఎల్ఓలు) ద్వారా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ఇప్పటికే పూర్తయిందని తెలిపారు. ఓటర్లు నింపిన ఎన్యుమరేషన్ ఫారాలను జూలై 24 వరకు స్వీకరిస్తామని, ప్రస్తుతం ఫారాల స్వీకరణతో పాటు డిజిటలీకరణ ప్రక్రియ కూడా కొనసాగుతోందని చెప్పారు. నిర్ణీత గడువులోగా డిజిటలీకరణ పూర్తి చేసి, అర్హులైన ఏ ఒక్క నిజమైన ఓటరు కూడా ఓటు హక్కు కోల్పోకుండా పారదర్శకంగా ప్రక్రియ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
ప్రతి బుధవారం ఎన్నికల నమోదు అధికారుల (ఈఆర్వోలు) స్థాయిలో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు లేవనెత్తిన సందేహాలకు సమాధానాలు ఇచ్చిన కలెక్టర్, ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఆటోల ద్వారా టామ్‌టామ్ ప్రచారం నిర్వహించడంతో పాటు హెల్ప్‌డెస్క్‌ల ద్వారా ఓటర్లకు అవసరమైన సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, డీఆర్ఓ రాథోడ్ రమేష్, ఆర్డీఓలు దేవీదాస్, మోహన్ సింగ్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, తహసీల్దార్లు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.











