భైంసా, జూలై 29
బైంసా పట్టణంలోని గుజరిగల్లిలో గల శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో బుధవారం గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్న గురువుల సేవలను కొనియాడుతూ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.
బైంసా పట్టణంలోని గుజరిగల్లిలో గల శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో బుధవారం గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్న గురువుల సేవలను కొనియాడుతూ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగాధర్ సార్, మాతాజీలు, ఉపాధ్యాయులకు శాలువాలు కప్పి సత్కరించి, వారి సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు డి. శ్రీధర్, కార్యదర్శి కాశీనాథ్ తోటరాము, పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు గంగాధర్ టీచర్, పాఠశాల కమిటీ సభ్యులు, ప్రబంధకారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర అమూల్యమని, గురువులను గౌరవించడం భారతీయ సంస్కృతికి ప్రతీక అని పేర్కొన్నారు.












