నిజామాబాద్, 27 July
నిజామాబాద్‌లోని ఆర్మూర్ రోడ్డులోగల ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాల, మాణిక్‌భవన్ 1976-77 ఎస్ఎస్సీ బ్యాచ్ పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవ ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. 50 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై కలుసుకుని చిన్ననాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాల, మాణిక్‌భవన్ 1976-77 ఎస్ఎస్సీ బ్యాచ్ పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవ ఆత్మీయ సమ్మేళనం నగరంలోని ఆర్మూర్ రోడ్డులో ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో ఘనంగా నిర్వహించారు. 50 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న పూర్వ విద్యార్థులు చిన్ననాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ అప్పటి సంగతులను గుర్తు చేసుకున్నారు. ఆటపాటలతో ఉత్సాహంగా సందడి చేశారు.
అదే పాఠశాలలో విద్యనభ్యసించిన మోటూరి మురళి గుప్తా 17 ఏళ్లపాటు పాఠశాల అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పూర్వ విద్యార్థులతో కలిసి కార్యక్రమంలో పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు. అనంతరం మురళి గుప్తా మాట్లాడుతూ.. తన ఆహ్వానం మేరకు స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించేందుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.












