మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 26
జాతీయ పరీక్షల్లో పేపర్ లీకేజీలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కఠినమైన బిల్లును లోక్సభ ముందుకు తీసుకురానుంది. ఈ నేపథ్యంలో, కేంద్ర విద్యాశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు స్వీకరించిన ప్రహ్లాద్ జోషి తన బాధ్యతలను అధికారికంగా స్వీకరించారు. ఆయన ముందున్న సవాళ్లను అధిగమించి విద్యార్థుల విశ్వాసాన్ని తిరిగి పొందడంపై దృష్టి సారించనున్నారు.
కేంద్ర ప్రభుత్వం జాతీయ పరీక్షల విషయంలో మరింత నిబద్ధతతో వ్యవహరించనుంది. తన చిత్తశుద్ధిని చాటుకునే క్రమంలో అత్యంత కఠినమైన చట్టాన్ని తీసుకుని రాబోతోంది. జాతీయ పరీక్షలు నిర్వహించేటప్పుడు పేపర్ లీకేజి కనుక జరిగితే ఏమి చేయాలన్నది కూడా ఈ ప్రతిపాదిత బిల్లులో పొందుపరిచారు. నేరం రుజువు అయితే వేసే శిక్షలు కూడా గట్టిగా ఉండబోతున్నాయి. ఈ ప్రతిపాదిత బిల్లులో పేపర్ లీకేజిని వ్యవస్థీకృత నేరంగా పరిగణించడం విశేషం. అంటే ఒక టీం వర్క్ గా కొందరు కలసి చేస్తూ లక్షలాది మంది అమాయక విద్యార్ధుల భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు.
పేపర్ లీకేజి కనుక చేసినట్లుగా రుజువు అయితే నిందితులకు 10 కోట్ల రూపాయల దాకా భారీ జరిమానాతో పాటు పదేళ్ల జైలు శిక్షను కూడా అమలు చేయాలని ఈ బిల్లులో పెట్టారు. అలాగే తప్పు చేస్తే సర్వీస్ ప్రొవైడర్ల పైన కూడా ఎనిమిదేళ్ళ పాటు నిషేధం విధిసారు. వాటి మీద అయిదు కోట్ల రూపాయల భారీ జరీమానాను విధిస్తారు.
ఈ కేసులకు సంబంధించి త్వరగా తీర్పులు రావాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది. అందుకే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా రోజు వారీ విచారణతో మూడు నెలలలోనే తీర్పు వచ్చేలా చట్టంలో పొందుపరుస్తున్నారు. అన్ని విధాలుగా పకడబంధీగా రూపొందించిన ఈ బిల్లుని శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆమోదించారు. ఇక శనివారం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. సోమవారం ఈ బిల్లు లోక్ సభ ముందుకు వెళ్ళబోతోంది. అన్ని రాజకీయ పార్టీలు పేపర్ లీకేజీల పట్ల పూర్తిగా ఆగ్రహంగా ఉన్నందువల్ల ఈ బిల్లు నూరు శాతం మద్దతుతో ఆమోదం పొందుతుందని భావిస్తున్నారు.
ధర్మేంద్ర ప్రధాన్ స్థానంలో కొత్త విద్యా మంత్రిగా అదనపు బాధ్యతలు అందుకున్న ప్రహ్లాద్ జోషి ఆదివారం కర్తవ్య భవన్లో కేంద్ర విద్యాశాఖ మంత్రిగా అధికారికంగా తన బాధ్యతలు స్వీకరించారు. ఆయన ప్రస్తుతం వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ, పునరుత్పాదక ఇంధన శాఖల బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు. కొత్త విద్యా మంత్రి విద్యా శాఖకు సంబంధించి మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యా శాఖలో అమలూవుతున్న వివిధ పథకాలు, ఇతర కార్యక్రమాల అమలు తీరును సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి శ్రీ జయంత్ చౌదరి కూడా పాల్గొన్నారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాక ప్రహ్లాద్ జోషీకే విద్యా శాఖను ప్రధాని కట్టబెట్టారు అంటే అది ఆయన పట్ల బీజేపీ పెద్దలకు ఉన్న నమ్మకం అని అంటున్నారు. ఓటమి అన్నది లేకుండా వరుసగా అయిదు సార్లు ప్రహ్లాద్ జోషీ గెలుస్తూ వస్తున్నారు. ఆయన కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారు. ఆయన ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగారు. ఐదుసార్లు ఎంపీగా గెలిచి ధార్వాడ్ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా ఆ ప్రాంతంలో తన బలమైన రాజకీయ ఆధిపత్యాన్ని ప్రహ్లాద్ జోషీ కొనసాగిస్తున్నారు.












