మండలంలోని రాంటెక్ గ్రామంలో శుక్రవారం పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో రైతులకు పశువుల సంరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు.
ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా పశువులకు వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. శిబిరంలో రైతులకు పశువులకు సంతానోత్పత్తికి సంబంధించిన చికిత్స, మేలు జాతి దూడల ప్రదర్శన, వివిధ రకాల గడ్డి జాతుల ప్రదర్శన వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
వేసవి కాలంలో పశువుల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా వివరించారు. పశువుల ఆరోగ్య పరిరక్షణ, మెరుగైన ఉత్పాదకత సాధనలో భాగంగా ఈ కార్యక్రమాలు రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయని అధికారులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ బలిక్ అహ్మద్, డాక్టర్ ఎన్. రవీందర్, సూపరిండెంట్ అశోక్, ఎంపీఓ చంద్రశేఖర్, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.








