Nirmal/Sarangapur (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 25
నిర్మల్ జిల్లా ఉప సర్పంచ్ల ఫోరం సోషల్ మీడియా ఇంచార్జిగా చించాల ఉప సర్పంచ్ పీసర సాయినాథ్ గౌడ్‌ను ఏకగ్రీవంగా నియమించారు. ఈ నియామకాన్ని జిల్లా ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు పొద్దుటూరి సంపత్ రెడ్డి మరియు జిల్లా ఉప సర్పంచ్ల బృందం చేపట్టారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన వారికి కృతజ్ఞతలు తెలిపిన సాయినాథ్ గౌడ్, వాటిని సమర్థవంతంగా నిర్వర్తిస్తానని తెలిపారు.
నిర్మల్ జిల్లా ఉప సర్పంచ్ల ఫోరం సోషల్ మీడియా ఇంచార్జిగా చించాల ఉప సర్పంచ్ పీసర సాయినాథ్ గౌడ్‌ను ఏకగ్రీవంగా నియమించారు. నిర్మల్ జిల్లా ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు పొద్దుటూరి సంపత్ రెడ్డి మరియు జిల్లా ఉప సర్పంచ్ల బృందం ఈ నియామకాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా పీసర సాయినాథ్ గౌడ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు బొట్ల కార్తీక్ మరియు జిల్లా అధ్యక్షులు పొద్దుటూరి సంపత్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, సోషల్ మీడియా ద్వారా చురుకుగా పనిచేస్తానని అన్నారు.
జిల్లాలోని ఉప సర్పంచ్ల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం మరియు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని, ఉప సర్పంచ్ల సంక్షేమం కోసం ఎల్లవేళలా పనిచేస్తానని పీసర సాయినాథ్ గౌడ్ పేర్కొన్నారు.












