గుర్తు తెలియని మృతుడికి గౌరవప్రదంగా అంత్యక్రియలు
మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ సేవలకు ప్రశంసలు
ప్రొద్దుటూరు, జూలై 24 (మనోరంజని తెలుగు టైమ్స్):
ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అనారోగ్యంతో మరణించిన గుర్తు తెలియని వ్యక్తికి బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ సభ్యులు మానవత్వాన్ని చాటుతూ గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించారు.
పోలీసు సిబ్బంది సమాచారం అందుకున్న వెంటనే ఫౌండేషన్ టౌన్ అధ్యక్షుడు సుబాహన్ స్పందించి, సభ్యులతో కలిసి హిందూ స్మశానవాటికలో హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలను పూర్తి చేశారు.
ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ, సమాజంలో ఎవరూ లేని వారికి కూడా గౌరవప్రదమైన చివరి వీడ్కోలు లభించాలనే లక్ష్యంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. అవసరంలో ఉన్న వారికి అండగా నిలవడం మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ బాధ్యతగా భావిస్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్‌రావు, టౌన్ అధ్యక్షుడు సుబాహన్, సతీష్, అహమ్మద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే, మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ అమ్మ శరణాలయంలోని వృద్ధులకు సహాయం చేయదలచిన దాతలు ముందుకు రావాలని ఫౌండేషన్ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం 82972 53484, 91822 44150 నంబర్లను సంప్రదించాలని కోరారు.












