తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని ఓలా గ్రామంలో వెలసిన శ్రీ విఠలేశ్వర స్వామి ఆలయంలో శనివారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కుంటాల మాజీ ఎంపీపీ జీ.వి. రమణారావు స్వామివారిని దర్శించుకుని అభిషేకం, అర్చనలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి కృపతో కుంటాల మండల ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని ఆయన ప్రార్థించారు.
ఆలయ ప్రాంగణంలో భక్తి వాతావరణం నెలకొనగా, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి ఆశీస్సులు పొందారు.
ఈ కార్యక్రమంలో గందె రాజ్‌కుమార్, గందే శివకుమార్, మాజీ సర్పంచ్ గందె ప్రవీణ్, వీడీసీ అధ్యక్షుడు నర్సింలు, సుదర్శన్ పటేల్, మాజీ సర్పంచ్ ఎగ్గం గజ్జరాం, శరత్ గౌడ్, నాలం సాయన్న, రిటైర్డ్ టీచర్ రమేష్ గౌడ్, దేవదాస్, రిటైర్డ్ కానిస్టేబుల్ లింగం, ఓడ్నం గజేందర్ తదితరులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణతో ఆలయాన్ని మారుమోగించారు.












