కుంటాల, జూన్ 28
భారతీయ జనతా పార్టీ నిర్మల్ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా నియమితులైన సాదు ప్రభాకర్‌కు కుంటాల మండలం ఓలా గ్రామంలో ఆదివారం ఘన సన్మానం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కట్ట రవి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు, శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
భారతీయ జనతా పార్టీ నిర్మల్ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా నియమితులైన సాదు ప్రభాకర్‌కు కుంటాల మండలం ఓలా గ్రామంలో ఆదివారం ఘన సన్మానం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కట్ట రవి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పార్టీ పట్ల సాదు ప్రభాకర్ చూపిన అంకితభావం, సేవలకు గుర్తింపుగానే జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్ష పదవి లభించిందన్నారు. ఆయన నాయకత్వంలో పార్టీ గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం కావడంతో పాటు ఎస్సీ వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తారనే నమ్మకం వ్యక్తం చేశారు.
సాదు ప్రభాకర్ మాట్లాడుతూ.. తనపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తానని చెప్పారు.
కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.












