బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) జూన్ 27
బైంసా: ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ గన్నోరా, కోతుల్ గాం గ్రామ సర్పంచ్ లకు రూ. 95 లక్షల అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. గన్నోరాలో గోదాం నిర్మాణానికి రూ. 30 లక్షలు, కోతుల్ గాంలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 20 లక్షలు, వంతెన నిర్మాణానికి రూ. 45 లక్షలు మంజూరు చేశారు.
ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ గన్నోరా, కోతుల్ గాం గ్రామ సర్పంచ్ లకు అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. గన్నోరా గ్రామానికి రైతుల ధాన్యం నిల్వ కోసం 30 లక్షల రూపాయలతో గోదాం నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. అదే విధంగా కోతుల్ గాం గ్రామం లో సిసి రోడ్ల నిర్మాణానికి 20 లక్షల రూపాయల నిధులు, వంతెన నిర్మాణానికి 45 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారు.
ఈ సందర్భంగా సర్పంచులు, సంబంధిత గ్రామాల నాయకులు ఎమ్మెల్యేను సన్మానించి, కృతజ్ఞతలు చెప్పారు. గ్రామాల అభివృద్దే తన ధ్యేయం అని, దశలవారీగా నిధులు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచులు అప్పలరాజు, భూమేష్, మాజీ ఎంపిటిసి లక్ష్మీనారాయణ, నాయకులు పాల్గొన్నారు.











