ఆదివారం (మనోరంజని తెలుగు టైమ్స్) జూన్ 28
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విబీజీఆర్ఏఎంజి బిల్లు గ్రామీణ పేదలు, వ్యవసాయ కార్మికులు, ఉపాధి హామీ కూలీల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని ఆదివాసి కాంగ్రెస్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ ఆరోపించారు. ఈ బిల్లును రద్దు చేసి, ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విబీజీఆర్ఏఎంజి బిల్లు గ్రామీణ పేదలు, వ్యవసాయ కార్మికులు, ఉపాధి హామీ కూలీల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉందని, ఈ బిల్లును వెంటనే రద్దు చేసి ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని ఆదివాసి కాంగ్రెస్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ డిమాండ్ చేశారు.
ఆదివారం మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో జీవన ధారంగా ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచే ఎలాంటి చర్యలైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని ఆయన కోరారు. గ్రామాల్లో పని అడిగిన కూలీలకు తగినంత పని కల్పించడం లేదని, చేసిన పనులకు కూలి చెల్లింపులు వారాలు, నెలల తరబడి ఆలస్యం అవుతున్నాయని పేర్కొన్నారు.
పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలకు అనుగుణంగా కూలి రేటు లేకపోవడం వల్ల ఉపాధి హామీ కూలీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ పేదల ఉపాధి అవకాశాలు మరింత తగ్గిపోవడంతో పాటు ఉపాధి హామీ చట్టం నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.












