ఖానాపూర్, 6 September
నిర్మల్ ప్రతిభ ఖానాపూర్ ప్రతిభ ప్రతిభ నీట్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించింది. ఆమె సాధించిన విజయం ప్రతిభ గర్వకారణంగా నిలిచింది.
టౌన్, ఆంధ్రప్రభ: నిర్మల్ జిల్లా మండలం తర్లపాడు గ్రామానికి చెందిన గుండేటి రిషిత నీట్ ఫలితాల్లో ప్రతిభ చాటి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించి గ్రామానికి గర్వకారణంగా నిలిచింది. గుండేటి వాణి, లక్ష్మీనారాయణ దంపతుల కుమార్తె అయిన రిషిత.. సెప్టెంబర్ 4న విడుదలైన నీట్ ఫలితాల్లో ఆల్ ఇండియా ర్యాంక్ 88,172, తెలంగాణ రాష్ట్ర మెరిట్లో 1,105వ ర్యాంక్ సాధించింది. దీంతో మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి దశలో సీటు పొందింది. నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థిని పట్టుదలతో వైద్య విద్యలో సీటు సాధించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. రిషిత తండ్రి లక్ష్మీనారాయణ కొన్నేళ్లుగా గ్రామంలో కిరాణా దుకాణం నిర్వహిస్తూ పిల్లలను ఉన్నత స్థాయికి చేర్చాలనే లక్ష్యంతో చదివించారు. రిషిత లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో పదో తరగతి వరకు చదివి 10 జీపీఏ సాధించింది. అనంతరం కరీంనగర్లోని అల్ఫోర్స్ కళాశాలలో బైపీసీ చదివి, ఏడాది పాటు దీర్ఘకాలిక శిక్షణ తీసుకుని నీట్లో మంచి ర్యాంక్ సాధించింది. తమ ఆర్థిక పరిస్థితులను అధిగమించి కుమార్తె వైద్య సీటు సాధించడంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామ ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు రిషితను అభినందించారు.









