హైదరాబాద్, జూలై 27
రాష్ట్రంలోని ప్రాజెక్టులకు ఎట్టకేలకు వరద నీరు మొదలైంది. మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా ఎగువన కృష్ణా నదిపై ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు నిండిపోయాయి. ఈ ప్రాజెక్టుల నుండి నీటిని విడుదల చేయడంతో జూరాలకు వరద ప్రవాహాలు పెరిగాయి.
రాష్ట్రంలోని ప్రాజెక్టులకు ఎట్టకేలకు వరద నీరు మొదలైంది. గత సంవత్సరం జూన్ రెండో వారంలోనే జూరాలకు వరద నీరు వచ్చి చేరగా, ఈసారి కొంచెం ఆలస్యంగా జూలై చివరి వారంలో ప్రాజెక్టుకు ఫ్లడ్ ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది.
మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో, ఎగువన కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు దాదాపు నిండిపోయాయి. కృష్ణా నదితో పాటు తుంగభద్రలోనూ వరద ప్రవాహాలు క్రమంగా పెరుగుతున్నాయి.
కృష్ణా నది బేసిన్ లో అత్యంత కీలకమైన భారీ ప్రాజెక్టులైన ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాములు పూర్తి జలకళను సంతరించుకున్నాయి. ఈ రెండు ప్రాజెక్టుల నుండి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో జూరాలకు వరద ప్రవాహాలు వచ్చి చేరాయి. ఫలితంగా జూరాలు జలకళతో ఉట్టిపడుతున్నాయి.












