హైదరాబాద్, 2026-06-05
హైదరాబాద్లోని సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక తండ్రి తన సొంత కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. మద్యానికి బానిసై, విచక్షణ కోల్పోయిన నిందితుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
హైదరాబాద్లోని సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు కూతుళ్లతో కలిసి నివసిస్తున్న దంపతులకు సంబంధించిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. హౌస్కీపింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న నిందితుడు (45) మద్యానికి బానిసై, తరచూ భార్యాబిడ్డలతో గొడవలు పెట్టుకునేవాడని సమాచారం.
విచక్షణ కోల్పోయి దారుణానికి పాల్పడిన తండ్రి
మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన నిందితుడు తన రెండో కూతురిపై కన్నేసి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. కుటుంబ పరువు పోతుందనే భయంతో కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు.
పోలీసులను ఆశ్రయించిన బాలిక
అయినప్పటికీ తండ్రి అరాచకాలు ఆగకపోవడంతో, ఓపిక నశించిన బాధిత బాలిక సనత్నగర్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు బాలిక తండ్రిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.












