హైదరాబాద్, జులై 27
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాలో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రూ.2,278.14 కోట్ల భారీ అంచనా వ్యయంతో ఆదిలాబాద్ జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ నిర్మాణాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ ఉత్తర తెలంగాణ ఆర్థిక రూపురేఖలను మార్చనుంది.
తెలంగాణ ప్రాంతీయ పురోగతిలో ఒక సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదిలాబాద్ జిల్లాలో ఏకంగా రూ.2,278.14 కోట్ల భారీ అంచనా వ్యయంతో ఆదిలాబాద్ జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ నిర్మాణాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మొత్తం 2,009.23 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్న ఈ మెగా ప్రాజెక్ట్ ఉత్తర తెలంగాణ ప్రాంత ఆర్థిక రూపురేఖలను పూర్తిగా మార్చే గేమ్ చేంజర్‌గా నిలవడమే కాకుండా, రాబోయే రోజుల్లో ప్రాంతీయ విమానయాన రంగానికి ప్రధాన కేంద్రంగా మారనుంది.












