మిర్యాలగూడ, జూలై 2
మిర్యాలగూడ పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలు ఫీజులతో పాటు పుస్తకాలు, యూనిఫామ్, బూట్ల వ్యాపారంలోనూ దోపిడీకి పాల్పడుతున్నాయని బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ ఆరోపించారు. విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
మిర్యాలగూడ పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలలో ఫీజుల దోపిడీతో పాటు పుస్తకాలు, యూనిఫామ్, బూట్ల వ్యాపారం కూడా జోరుగా కొనసాగుతోందని, అయితే విద్యాశాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ ప్రశ్నించారు.
పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలు అధిక రేట్లకు పుస్తకాలు అమ్ముతూ, ప్రతి పాఠశాలలోనూ విద్యార్థులు తమ దగ్గరే పుస్తకాలు, యూనిఫామ్ తీసుకోవాలని తల్లిదండ్రులను ఒత్తిడి చేస్తున్నాయని, ఈ విధంగా పుస్తకాల, యూనిఫామ్ పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులు దండుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
విద్యాశాఖ ఉన్నత అధికారులు ప్రతి పాఠశాలను తనిఖీ చేసి, పుస్తకాలు విక్రయిస్తున్న పాఠశాలల యాజమాన్యాలపై తగు చర్యలు తీసుకోవాలని తిరుమలగిరి అశోక్ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్క నాగేశ్వరరావు, బీసీ యువజన సంఘం జిల్లా కన్వీనర్ సిద్ధం రాజు, యువజన సంఘం నియోజకవర్గ నాయకులు మునగల శైలేందర్, బీసీ యువజన సంఘం పట్టణ కన్వీనర్ పట్టేటి రమేష్, బీసీ యువజన సంఘం పట్టణ కార్యదర్శి ఉపేందర్, రమేష్, శంకర్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.











