మిర్యాలగూడ, జూలై 2
పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేయాలని కోరుతూ బీసీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు విరాల్లోని జూనియర్ కళాశాలలో గురువారం బంద్ పాటించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు రావలసిన ఫీజు బకాయిలను విడుదల చేయాలని బీసీ జేఏసీ పట్టణ కన్వీనర్ బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ డిమాండ్ చేశారు.
పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేయాలని కోరుతూ బీసీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు విరాల్లో జూనియర్ కళాశాలలో గురువారం బంద్ పాటించారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ పట్టణ కన్వీనర్ బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా విద్యార్థులకు రావలసిన ఫీజు బకాయిలు విడుదల చేయాలన్నారు.
పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలన్నింటినీ విడుదల చేయాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు యర్రబెల్లి దుర్గయ్య రజక, బీసీ మహిళ సంఘం జిల్లా కార్యదర్శి బంటు కవిత, బీసీ యువజన సంఘం పట్టణ నాయకులు ఎస్ పి నాయుడు, బీసీ విద్యార్థి సంఘం పట్టణ కార్యదర్శి నక్క నాగరాజు ముదిరాజ్, యస్సి మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు చిత్రం ఉమా, ఎమ్ ఆర్ పి ఎస్ నాయకులు ఉబ్బపల్లి శంకర్, సిరి గణేష్, శాంతికుమార్, శ్రీజ, శ్రీవల్లి, గాయత్రీ, సహస్ర, మానస, శ్రీవాణి, సిరి, సాయికుమార్, గౌతమ్, అశోక్ కుమార్, వెన్నెల, పావని, కరుణాశ్రీ తదితరులు పాల్గొన్నారు.











