మిర్యాలగూడ జూలై 9 (మనోరంజని తెలుగు టైమ్స్)
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మిర్యాలగూడ షీ టీమ్ ఆధ్వర్యంలో స్థానిక రామచంద్ర గూడెం చైతన్య నగర్ లో గల సెయింట్ జాన్స్ హై స్కూల్లో విద్యార్థులకు బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో
సీఐ.మంజుల,
ఎస్ఐ. కె .వెంకటేశ్వర్లు,
హెడ్ కానిస్టేబుల్ ఎం.డి. ఎం. హుస్సేన్,
కానిస్టేబుల్ కె. రాజేశ్వరి హాజరై విద్యార్థులకు మైనర్ డ్రైవింగ్, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, మాదకద్రవ్యాల (డ్రగ్స్) నివారణ, ట్రావెల్ సేఫ్టీ వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
పాఠశాల ప్రిన్సిపాల్ అలుగుబెల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు ప్రస్తుత సమాజంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనేలా అవగాహన, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడం ఎంతో అవసరమని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ అలుగుబెల్లి శిరీష, ఉపాధ్యాయులు రవి శంకర్ రెడ్డి, బాలక్రిష్ణ , పరమేశ్వరి, నాగ లక్ష్మి, లావణ్య, విద్యార్థులు పాల్గొన్నారు.











